ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ACCIDENT : గుర్తు తెలియని వాహనం ఢీ.. యువకుడు మృతి - one man died in a road accident at rayachoti

కడప జిల్లాలోని రాయచోటి రింగ్ రోడ్డు వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

గుర్తు తెలియని వాహనం ఢీ కొని యువకుడు మృతి
గుర్తు తెలియని వాహనం ఢీ కొని యువకుడు మృతి

By

Published : Oct 22, 2021, 11:16 AM IST

కడప జిల్లా రాయచోటి పట్టణంలోని అలీమాబాద్ వీధికి చెందిన కరీం.. ద్విచక్రవాహనంపై తన మిత్రుడితో కలిసి పట్టణానికి వస్తున్నాడు. మదనపల్లె రింగ్ రోడ్డు వద్దకు చేరుకునే సరికి వీరు ప్రయాణిస్తున్న బైకును.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.

ఈ దుర్ఘటనలో కరీం మృతి చెందగా.. అతని స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు.. గాయపడ్డ యువకుడిని కడప రిమ్స్​కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి.
Intel Data Lab : ఆంధ్రప్రదేశ్‌ వీఐటీలో ఇంటెల్‌ డేటా ల్యాబ్‌

ABOUT THE AUTHOR

...view details