ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంటి ముందు రక్తపుమడుగు.. అందులో మృతదేహం!

Man Suspicious death: వైఎస్సార్‌ కడప జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి కలకలం సృష్టించింది. రక్తపు మడుగులో పడిఉన్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇంతకీ ఏం జరిగింది?

Man Suspicious death
వ్యక్తి అనుమానాస్పద మృతి

By

Published : Aug 5, 2022, 12:36 PM IST

Man Suspicious death: వైఎస్సార్‌ జిల్లా పులివెందులలోని సింహాద్రిపురం మండలం ఇనుకుంటలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కడప జిల్లా సింహాద్రిపురం మండలం ఇనుకుంట గ్రామానికి చెందిన ఆదినారాయణ రెడ్డి.. పులివెందులలోని కడప రోడ్డులో ఉన్న భారతీయ నగర్​లో నివాసం ఉంటున్నాడు. ఇవాళ తెల్లవారుజామున స్థానికులు గమనించగా.. ఇంటి ఆవరణలోనే రక్తపు మడుగులో విగత జీవిగా పడిఉన్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు ఆదినారాయణ రెడ్డి అవివాహితుడు. అతనికి నాలుగు ఎకరాల పొలం, ఓ ఇల్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఆస్తి కోసంఎవరైనా హత్య చేసి ఉంటారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం పక్కన కారంపొడి ఉండటం, తల, శరీరంపై గాయాలు ఉండడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details