ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BADVEL by-poll : 'మార్గదర్శకాలపై అవగాహన కలిగి ఉండాలి' - meeting with nodal officers about badvel by-poll

బద్వేలు ఉపఎన్నిక సందర్భంగా.. నోడల్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఉపఎన్నిక జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

బద్వేలు ఉపఎన్నిక సందర్భంగా కలెక్టర్ సమావేశం
బద్వేలు ఉపఎన్నిక సందర్భంగా కలెక్టర్ సమావేశం

By

Published : Oct 1, 2021, 10:40 PM IST

ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలపై నోడల్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు అధికారులకు సూచించారు. నిర్దేశించిన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించాలన్నారు. బద్వేలు బాలయోగి బాలికల గురుకుల కళాశాలలో.. బద్వేలు ఉపఎన్నికపై ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఉపఎన్నిక జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details