కడప కలెక్టరేట్లోని సహఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ ఓ అధికారిణి ఏసీబీకి పట్టుబడింది. కలెక్టరేట్ లోని ఓ బ్లాక్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాధికాకు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇంక్రిమెంట్ రావాల్సి ఉంది. ఈ విషయానికి సంబంధించిన బిల్లులను మంజూరు చేసేందుకు జిల్లా ఆస్పత్రి సమన్వయ శాఖ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ పద్మజా 5వేల రూపాయలు డిమాండ్ చేసింది. లంచం ఇచ్చేందుకు ఇష్టపడని రాధిక ... ఏసీబీ డి.ఎస్.పి నాగభూషణంకు ఫిర్యాదు చేసింది. డాక్టర్ పద్మజా తన ఛాంబర్లో రాధిక నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు అక్కడికక్కడే పట్టుకున్నారు. కేసు నమోదు చేసి కర్నూలు ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
ఏసీబీకి చిక్కిన కడప కలెక్టరేట్ ఉద్యోగి - kadapa
సహఉద్యోగి నుంచి 5వేలు లంచం తీసుకుంటూ.. కడప జిల్లా కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కారు.
ఏసీబీ వలలో కడప జిల్లా ఆస్పత్రి సమన్వయ శాఖ అధికారి