నగరంలో శుక్రవారం అరగంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ నీటమునిగి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, కోర్టు ఎదుట, పాత బస్టాండ్, అక్కయ్య పల్లి, నకాష్ వీధి, భాగ్యనగర్ కాలనీ, ప్రకాష్ నగర్, మృత్యుంజయ కుంట తదితర ప్రాంతాల్లోకి నీరు చేరడం వల్ల ప్రజలు అవస్థలు పడ్డారు. మురికి కాలువలు పొంగి రోడ్లపై ప్రవహించాయి. నగర వీధుల్లో మోకాల్లోతుగా వర్షపు నీరు వచ్చి చేరింది.
భారీ వర్షానికి నగరవాసుల ఇక్కట్లు - kadapa city heavy rains latest news
శుక్రవారం కురిసిన భారీ వర్షానికి నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. మురికి గుంటలు నిండి రోడ్లపైన ప్రవహించాయి. పల్లపు ప్రాంతాల్లో నివసించే ప్రజలు.. తమ ఇళ్లల్లోకి నీరు చేరడం వల్ల అవస్థలు పడ్డారు.
కడపలో భారీ వర్షం