Four Districts JAC Meet : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త పీఎస్సీ హెచ్ఆర్ సంబంధించిన జీవోలను తక్షణం రద్దు చేయకుంటే ఉద్యమం తప్పదని నాలుగు జిల్లాల జేఏసీ నాయకులు తెలిపారు.
కడప జిల్లా..
కడప ఎస్టీయూ భవన్లో రాయలసీమ జిల్లాలకు సంబంధించిన జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పింఛన్ సంఘం నాయకులు, ఆర్టీసీ యూనియన్ నాయకులు, సచివాలయ ఉద్యోగులు కూడా హాజరయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబునాయుడు కంటే ఎక్కువగా పీఆర్సీ మంజూరు చేస్తానని చెప్పి ఇప్పుడు మాట తప్పారని ఆరోపించారు. అధికారులు ముఖ్యమంత్రిని తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పారు. కరోనా సమయమని, ఆర్థిక ఇబ్బందులు వల్ల మౌనం పాటించామని తెలిపారు. ఇక ఉపేక్షించే ప్రసక్తే లేదని ఉద్యమంతోనే సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఉన్న జీతాలను తగ్గించారని పేర్కొన్నారు. పైగా ఉద్యోగుల పైనే సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం పెట్టడం దారుణమని ఖండించారు. పాలకులు కోట్ల రూపాయలు సంపాదించి వెనకేసుకున్న రని ధ్వజమెత్తారు. 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని, పాలకులు మాత్రం ఐదేళ్ల వరకు మాత్రమే ఉంటారని విషయాన్ని గుర్తుంచుకోవాలని తర్వాత ఎవరు అధికారం లోకి వస్తారో కూడా తెలియని పరిస్థితులు ఉంటాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఒక్కసారి ఆలోచించి తమ సమస్యలను పరిష్కరించాలని లేదంటే సమర శంఖారావం పూరిస్తానమని కడప జిల్లా సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.
ఇదీ చదవండి :AP Employees Round Table Meeting: విజయవాడలో ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం
కర్నూలుజిల్లా..
ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిరంకుశత్వంతో వ్యవహరిస్తోందని కర్నూలు జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ఐకాస నాయకులు ధ్వజమెత్తారు. పీఆర్సీపై కర్నూలులోని డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మెరుగైన పీఆర్సీ ప్రకటించేవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. కొందరు వైకాపా నాయకులు ఉద్యోగులను తక్కువ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని.. ముఖ్యమంత్రి స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, రిలే దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి :Woman died at Pargi : ఆమె మృతికి అతడిచ్చిన ఇంజెక్షనే కారణం...మాకు న్యాయం కావాలి..
విజయనగరం జిల్లా..
సంప్రదాయాలను పక్కనపెట్టి కొత్త దారిలో వెళ్తున్న ప్రభుత్వంపై పోరాటం తప్పదన్నారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ. విజయనగరం ఎన్జీవో హోమ్ లో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఇన్నేళ్ల చరిత్రలో ఇంతవరకూ ఎప్పుడు చూడని, వినని పరిస్థితి ఉద్యోగులకు ఎదురైంది అన్నారు. ఆశుతోష్ కమిటీ నివేదికను పక్కనపెట్టి సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీకి ప్రాధాన్యత ఇవ్వడం అమానుషం అని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వీకులు వారసత్వంగా ఇచ్చిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తామని ఏవైతే ఉద్యోగుల హక్కులు ఉన్నాయో వాటిని సాధించి తీరుతామన్నారు.ఈ కార్యాక్రమంలో అధికంగా ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :Asian Games gold Medalist Sadiya Sanmanam : ఆసియా క్రీడల్లో స్వర్ణ విజేత సాదియాకు సన్మానం...
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!