కడపలోని బిల్టప్ సమీపంలోని గోదాంలో బుధవారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ప్లాస్టిక్ కాలిబూడిదైంది. మంటలు భారీఎత్తున ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది... ఘటనా స్థలానికి చేరుకొని రాత్రంతా శ్రమించి మంటలను అదుపు చేశారు. ఉదయం వరకు మంటలు వస్తూనే ఉన్నాయి.
ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం - కడప జిల్లా తాజా వార్తలు
కడప బిల్టప్ సమీపంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. భారీ ఎత్తున ఎగిసిపడ్డ మంటలను మంటలను అగ్నిమాపక సిబ్బంది రాత్రంతా శ్రమించి అదుపు చేశారు.
ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం
ఈ ప్రమాదంలో గోదాం మొత్తం కాలి బూడిదైంది. సుమారు రూ.40 లక్షల మేరకు ఆస్థి నష్టం వాటిల్లిందని నిర్వాహకులు తెలిపారు. అగ్నిమాపక శాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.