రాష్ట్రంలోని 13 జిల్లాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తుంటే... కేవలం 5 గ్రామాల అమరావతి ప్రజల కోసం ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పరితపిస్తున్నాడని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. మూడు రాజధానులను రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తుంటే.... తెదేపా నాయకులు మాత్రం తమ ఆస్తులు కాపాడుకోవడానికి అమరావతిలో ఆందోళనలు చేయిస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ జిల్లాలు అభివృద్ధి చెందడం తెదేపా వారికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకు రాయలసీమకు హైకోర్టు ఏర్పాటు చేస్తుంటే.. ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జీఎన్ రావు, బీసీజీ, శివరామకృష్ణ కమిటీలను పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. జగన్ పాలనను తుగ్లక్ పాలనగా పోల్చే విపక్ష నేతలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
రాయలసీమ అభివృద్ధి చెందడం వారికి ఇష్టం లేదా..?: అంజాద్ బాషా
మూడు రాజధానుల నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తుంటే... తెదేపా నాయకులు మాత్రం తమ ఆస్తులు కాపాడుకోవడానికి అమరావతిలో ఆందోళనలు చేయిస్తున్నారని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. రాయలసీమ జిల్లాలు అభివృద్ధి చెందడం వారికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు.
ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా