కడప మున్సిపల్ స్టేడియంలో కూరగాయల దుకాణాల విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. లాక్డౌన్ కారణంగా ప్రభుత్వం కూరగాయల మార్కెట్‌ను కడప మున్సిపల్ మైదానానికి మార్చారు. గత రెండు నెలల నుంచి అక్కడే కూరగాయలు విక్రయిస్తున్నారు.
ఇరు వర్గాల మధ్య స్థల వివాదం..ఘర్షణలో వ్యక్తి మృతి
స్థల వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. కడపలో జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
షేక్ మహమ్మద్ ఎజాజు అనే వ్యక్తి ఈ మైదానంలో ఉల్లిపాయల దుకాణం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. కొద్దిరోజుల కిందట సత్తార్ అనే వ్యక్తి కూడా అక్కడే ఉల్లిపాయల వ్యాపారం ప్రారంభించాడు. సత్తార్‌కు కావలసిన స్థలాన్ని షేక్ మహమ్మదే ఇచ్చాడు. అయితే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని సత్తార్‌ను షేక్ మహమ్మద్ కోరాడు. కానీ అతను ఖాళీ చెయ్యలేదు. ఈ క్రమంలో షేక్ మహమ్మద్, సత్తార్ మధ్య వాగ్వాదం నెలకొని.. ఇరు వర్గాల ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో షేక్ మహమ్మద్‌పై కర్రలతో దాడి చేయడంతో అతను కుప్పకూలాడు. వైద్యం నిమిత్తం వెంటనే రిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు హత్య కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.