CBI resumes probe into YS Vivekananda Reddy murder case: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ మళ్లీ మొదలైంది. దాదాపు నెలరోజుల తర్వాత కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో సీబీఐ విచారణ సాగుతోంది. పులివెందులకు చెందిన భరత్ కుమార్ యాదవ్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్యకేసులో అరెస్ట్ అయిన సునీల్ యాదవ్ బంధువైన భరత్ యాదవ్‌ను సీబీఐ విచారిస్తోంది.
YS Vivekananda Reddy murder case: వివేకా హత్యకేసులో వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపణలు చేస్తూ.. గతనెల 21న భరత్ కుమార్ యాదవ్.. సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో భరత్ యాదవ్‌ను సీబీఐ విచారణకు పిలిచింది. అతని వద్దనున్న ఆధారాలు.. ఎందుకు రాజశేఖర్ రెడ్డిపైన ఆరోపణలు చేస్తున్నారనే అంశాలపై సీబీఐ సుదీర్ఘంగా ప్రశ్నిస్తోంది. ఈ కేసులో మరికొందరిని కూడా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సీబీఐ అభియోగపత్రంలో..
ys viveka murder case: వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యలో ఎర్ర గంగిరెడ్డి, యాదటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్ దస్తగిరి పాత్ర ఉందని సీబీఐ తేల్చింది. ఆ నలుగురి ప్రమేయంపై మంగళవారం పులివెందుల న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేసింది. ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిల నేపథ్యం, ఈ హత్య కేసులో వారి ప్రమేయానికి సంబంధించి సీబీఐ దర్యాప్తులో గుర్తించిన అంశాలు ఇలా ఉన్నాయి.
అంతమొందించేందుకు ప్రణాళిక
గజ్జల ఉమాశంకర్‌రెడ్డి:వివేకా వద్ద పీఏగా పనిచేసిన జగదీశ్వరరెడ్డి సోదరుడు ఉమాశంకర్‌రెడ్డి. ఈయనది కడప జిల్లా సుంకేశుల. పాల డెయిరీ నిర్వహిస్తుంటారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్‌ను వివేకాకు పరిచయం చేసింది ఈయనే.
సీబీఐ ఏం తేల్చిందంటే:వివేకాను అంతమొందించేందుకు సునీల్‌తో కలిసి ప్రణాళిక రూపొందించారు. ఇంటి వద్ద ఉండే కుక్కను ఉమాశంకర్‌రెడ్డి కారుతో గుద్దించి చంపేశారు. సేకరించిన శాస్త్రీయ ఆధారాలను గుజరాత్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ డైరెక్టరేట్‌తోపాటు మరికొన్ని ప్రయోగశాలల్లో విశ్లేషించగా... ఈ హత్యలో ఉమాశంకర్‌రెడ్డి పాత్ర తేటతెల్లమైంది. హత్యలో శంకర్‌రెడ్డి ప్రమేయం ఉందంటూ సునీల్ యాదవ్, దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు.
గొడ్డలిని బైక్ సైడ్ బ్యాగ్‌లో దాచిపెట్టి