ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BJP Ramesh Naidu on YCP ruling : నిధులు కేంద్రానివి..ప్రచారం జగన్ ది -భాజపా నేత రమేశ్ నాయుడు

BJP Ramesh Naidu on YCP ruling : వైకాపా పాలనపై భాజపా రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లాలోని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆయన.. కేంద్రం రాష్ట్రానికి నిధులిస్తున్నా అరకొర వసతులు కల్పిస్తున్నారన్నారు.

BJP Ramesh Naidu on YCP ruling
నిధులు కేంద్రానివి..ప్రచారం జగన్ ది

By

Published : Jan 12, 2022, 7:11 PM IST

BJP Ramesh Naidu on YCP ruling : వైకాపా పాలనపై భాజపా రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లాలోని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిని భాజపా బృందం సందర్శించింది. కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు కేటాయించిన ఆక్సిజన్ ప్లాంట్​ను ఆయన పరిశీలించారు. కేంద్రం రాష్ట్రానికి నిధులిస్తున్నా అరకొర వసతులు కల్పిస్తున్నారన్నారు. కరోనా ముప్పు ముంచుకొస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏర్పాట్లు పట్టించుకోవడం లేదన్నారు. ప్రధాని మోదీ ఫొటో లేకుండానే 'జగనన్న ప్రాణవాయువు' ప్రచారం చేసుకోవడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో 27 మంది వైద్య సిబ్బంది విధుల్లో ఉండాల్సి ఉండగా.. కేవలం 9 మంది ఉండడంపై ఆయన ఆసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఆవరణ అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం ప్రచారం తప్ప వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్ర వైద్యశాలల్లో కేంద్రం సూచించిన నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని.. నిధులు పక్కదారి పడుతున్నాయన్న అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details