UTF Rally: సీపీఎస్ రద్దు చేయకుంటే మిలిటెంట్ తరహా ఉద్యమానికి...శ్రీకారం చూడతామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. సీపీఎస్ రద్దు చేయాలంటూ కడపలో బైక్ ర్యాలీలో పాల్గొన్న ఆయన... ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఉద్యమాన్ని అణచివేసినంత మాత్రాన తగ్గే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
సీపీఎస్ రద్దు చేయాలని.. యూటీఎఫ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు - rally under auspices of UTF to abolish CPS
UTF Rally: పలు ప్రాంతాల్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సీపీఎస్ రద్దు చేయకుంటే మిలిటెంట్ తరహా ఉద్యమం చేపడతామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్చరించారు.
"సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చకపోగా నిర్బంధాలతో ఉద్యమాన్ని అణిచివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉద్యోగులకు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నేరవేర్చలేదు. సీపీఎస్‌ను కూడా నెరవేర్చే ప్రయత్నం చేయకుండా కాలయాపన కమిటీలను, కాలయాపన చర్చలు చేస్తున్నారు. సీపీఎస్‌ను రద్దు చేయడం తప్ప మరొక అంశాన్ని మేము అంగీకరించేది లేదు. త్వరలో సీపీఎస్‌పై ఎలాంటి ప్రతిపాదన రాకపోతే.. కచ్చితంగా సీపీఎస్‌కు సంబంధించి మిలిటెంట్ తరహా ఉద్యమం చేపడతాం" -వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
UTF Rally: సీపీఎస్ రద్దు పోరు గర్జనలో భాగంగా కాకినాడ జిల్లా తునిలోనూ అంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ప్రదర్శన జరిగింది. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇచ్చాపురం నుంచి విజయవాడ ప్రదర్శన నేపథ్యంలో.. తుని నుంచి భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తుని నుంచి కాకినాడ వరకు ప్రదర్శన చేపట్టారు.
ఇదీ చదవండి: సీఎం జగన్ పర్యటన దృష్ట్యా.. తెదేపా నేతల గృహ నిర్బంధం