కడప జిల్లా బద్వేల్లో బుధవారం సాయంత్రం 7 గంటలతో ముగిసింది. 72 గంటల ముందే ప్రచారానికి తెరపడింది. ఈనెల 30న జరిగే పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 30న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్(arrangements for Badvel by poll) జరగనుంది. బద్వేల్ నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. 2 లక్షల 15 వేల 292 మంది ఓటర్లు ఉన్నారు. అధికారులు 281 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 148 అత్యంత సమస్యాత్మక, 52 సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఈవీఎం(EVM) ల ద్వారా జరిగే ఎన్నికల కోసం వెబ్ కాస్టింగ్ ఏర్పాటు(Badvel by-election) చేశారు. 11 వందల 24 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఈనెల 29న ఎన్నికల సామగ్రి, ఈవీఎం బ్యాలెట్లను ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తారు.
నియోజకవర్గంలో భద్రత, పోలింగ్‌పై..రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ పోలీసులకు సూచనలు(Badvel by-election arrangements ) ఇచ్చారు. ప్రచారం ముగిసిన వెంటనే నియోజకవర్గంలో బయటి వ్యక్తులు ఉండకూడదంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించినట్లు కలెక్టర్ విజయరామరాజు స్పష్టం చేశారు.
ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా నియోజకవర్గం పరిధిలో 21 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. 2 వేలమంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. వీరు కాకుండా ఇప్పటికే 15 ప్లటూన్ల పారా మిలటరీ దళాలు ఇప్పటికే నియోజకవర్గానికి చేరుకున్నాయని(Badvel by-election arrangements ) వివరించారు. ఎన్నికల సందర్భంగా ఎక్కడైనా గొడవలు జరిగితే సంబంధిత వ్యక్తులపై రౌడీషీట్ తెరుస్తామని హెచ్చరించారు.
బరిలో 15 మంది..
బద్వేలు అసెంబ్లీ స్థానానికి గత రెండు దశాబ్దాల్లో జరిగిన ఎన్నికల్లో.. అత్యధికంగా ఈసారే 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ స్థానానికి చివరిసారిగా 2001లో ఉప ఎన్నిక నిర్వహించగా.. అప్పుడు 14 మంది పోటీలో నిలిచారు. అనంతరం 2004లో ఆరుగురు, 2009లో 12 మంది, 2014లో 13 మంది, 2019లో 14 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు.