రవాణా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 29, 30 తేదీల్లో విజయవాడలో జాతీయ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య వెల్లడించారు. ఈ సమావేశాలతోనైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని అన్నారు. కడపలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో కేవలం 60 శాతం మాత్రమే వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే 35 సార్లు ఇంధన ధరలు పెంచారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలవల్ల రవాణా రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశాన్ని జయప్రదం చేసి రవాణా రంగ కార్మికుల సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆలిండియా రోడ్ ట్రాన్స్‌ఫోర్టు ఫెడరేషన్ జాతీయ సమావేశాలకు సన్నద్ధం..
విజయవాడలో ఈనెల 29, 30 తేదీల్లో జాతీయ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య వెల్లడించారు. రవాణా కార్మికుల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్