ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS : ప్రధాన వార్తలు @ 3pm - ap news

.

ప్రధాన వార్తలు @ 3pm
ప్రధాన వార్తలు @ 3pm

By

Published : Jan 13, 2022, 3:00 PM IST

  • Chiranjeevi meets cm Jagan: సినిమా టికెట్ల ధరలు పెంచాలని సీఎంను కోరిన చిరంజీవి

ముఖ్యమంత్రి జగన్‌తో సినీ నటుడు చిరంజీవి సమావేశమయ్యారు. సీఎం జగన్‌, చిరంజీవి మధ్య గంటన్నరపాటు చర్చలు జరిగాయి. సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను చిరంజీవి ముఖ్యమంత్రికి వివరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • MP RRR: ఉద్యోగులకు జగనన్న శఠగోపం: రఘురామకృష్ణరాజు

mp raghurama slams YSRC Govt: తనని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు పోరాడాలని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. నర్సాపురం నియోజకవర్గ ప్రజలు తిరిగి తనని గెలిపించుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Rains: ఉపరితల ద్రోణి ప్రభావం.. రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు

ఉపరితల ద్రోణి ప్రభావం, వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులతో తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ నగర వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. ఇవాళ ఉదయం 9గంటల నుంచి వర్షం కురుస్తుండటంతో.. నగరంలోని పలు రోడ్లు జలమయమయ్యాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Wife Murdered Husband: పిల్లలున్నా.. ప్రియుడే కావాలంది.. మొగుడిని కడతేర్చింది..!

Wife murdered husband at ponnuru: పెళ్లై పిల్లలున్నా.. ప్రియునితోనే కలిసుండాలనే ఆమె కోరిక కట్టుకున్నవాడినే కడతేర్చేలా చేసింది. ప్రియుడితో కలిసి.. తన భర్తను ఓ ఇల్లాలు అంతమొందించిన ఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • రూ.8కోట్లు ఖర్చు.. కరోనాపై 8 నెలల పోరాటం.. అయినా దక్కని రైతు ప్రాణం!

Farmer died due to Covid 19: ఓ రైతు కరోనా మహమ్మారిపై ఎనిమిది నెలల పాటు పోరాటం సాగించి ఓడిపోయారు. దేశవిదేశాల నుంచి వైద్యులను రప్పించినా ఆయనను రక్షించలేకపోయారు కుటుంబ సభ్యులు. చికిత్స కోసం తమకు ఉన్న 50 ఎకరాలు అమ్మేసి, రోజుకు రూ.3 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • అగ్ర నేతలకు కరోనా- పాదయాత్రను నిలిపివేసిన కాంగ్రెస్​!

Mekedatu Padayatra: మేకెదాతు పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కర్ణాటక కాంగ్రెస్ ప్రకటించింది. కరోనా కేసుల పెరుగుదలతో ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • చైనా క్రూరత్వం.. ఇనుప పెట్టెల్లో కొవిడ్ బాధితులు.. ముగ్గురికి జైలు

China covid restrictions: మూడో దశ కోవిడ్‌ వ్యాప్తితో అల్లాడుతున్న ప్రపంచదేశాలు కరోనా కట్టడి కోసం ప్రజలను సిద్ధం చేసేందుకు అనేక కష్టాలు పడుతున్నాయి. అయితే ఈ మహమ్మారి వైరస్‌కు పుట్టినిల్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా మాత్రం తమ ప్రజలపట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Gold Price today: పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?

Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో గురువారం ధరలు ఎలా ఉన్నాయంటే? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • IND vs SA: దక్షిణాఫ్రికాకు తలనొప్పిగా కోహ్లీ, పుజారా!

IND vs SA: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్​ఇండియా సారథి కోహ్లీ, పుజారా.. తమకు తలనొప్పిగా మారారని అన్నాడు ప్రత్యర్థి జట్టు ఆటగాడు కీగన్ పీటర్సన్. నేడు(గురువారం) జరిగే ఆటలో వాళ్లను త్వరగా పెవిలియన్​కు చేర్చడంపై దృష్టిసారిస్తామన్నాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • RRR censor review: 'మైండ్​ బ్లోయింగ్​.. ఎన్టీఆర్​ నటన టాక్​ ఆఫ్​ ది టౌన్​'

RRR censor review: ఎన్టీఆర్​, రామ్​చరణ్​ నటించిన 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమా సెన్సార్​ రివ్యూ అంటూ ఓ ట్వీట్​ సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. ఈ చిత్రం మైండ్​ బ్లోయింగ్​గా ఉందంటూ సెన్సార్​ పెర్కొందని యూఏఈ సెన్సార్​ బోర్డు సభ్యుడు ఉమైర్​ సంధు ఈ ట్వీట్​ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details