ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 3pm - ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు @ 3pm
ప్రధాన వార్తలు @ 3pm

By

Published : Nov 8, 2021, 3:01 PM IST

  • విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే.. లాఠీఛార్జ్ చేస్తారా? : లోకేశ్‌

అనంతపురంలో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (nara lokesh fire on police lathicharge at anantapur) తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను అణచివేయాలని చూస్తే.. గుణపాఠం తప్పదని హెచ్చరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • కుప్పంలో ఎన్నికల అధికారిని మార్చాలని హైకోర్టులో పిటిషన్‌

కుప్పం నగర పంచాయతీ ఎన్నికల ప్రత్యేక అధికారిని మార్చాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్(petition in high court against kuppam election officer) దాఖలైంది. ఈ పిటిషన్​పై మంగళవారం విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • AMARAVATHI FARMERS: మహాపాదయాత్ర చేస్తున్న రైతులపై కేసులు!

అమరావతి ఒక్కటే రాజధానిగా కొనసాగించాలని నినదిస్తూ.. పాదయాత్ర చేపట్టిన రైతులు, మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం రెండు కేసులు నమోదుచేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • VELIGONDA EXPATRIATES: ఆర్డీఓ కార్యాలయం తలుపులు మూసేసి ఆందోళన

ప్రకాశం జిల్లా మర్కాపూరం ఆర్డీఓ కార్యాలయం తలుపులు మూసివేసి వెలిగొండ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. ఆత్మహత్యకు పాల్పడిన బాధిత కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • యమునా నదిలో విషపు నురగలు- అందులోనే పుణ్యస్నానాలు

'ఛఠ్​ పూజ' వేడుకలు(Chhath Puja 2021) సోమవారం ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే.. దిల్లీలోని యుమునా నదిలో(Yamuna River Pollution) విషపు నురగలు ప్రవహిస్తుండడం.. అక్కడి ప్రజలకు ఇబ్బందిగా మారింది. కలుషిత నీటిలోనే పుణ్య స్నానాలు ఆచరిస్తూ భక్తులు వేడుకల్లో పాల్గొంటున్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 3 కిమీ మేర స్తంభించిన ట్రాఫిక్- వాహనదారుల ఇక్కట్లు​

ఉత్తర్​ప్రదేశ్​లోని యమునా ఎక్స్​ప్రెస్​ వేపై ఆదివారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ (Yamuna Expressway Traffic Jam)​ స్తంభించింది. మథురాలోని టోల్​ ప్లాజాల దగ్గర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • చైనాలో హిమపాతం.. మంచు ముసుగులో పర్యటక ప్రాంతాలు!

చైనాలో హిమపాతం (China Snowfall) పర్యావరణ ప్రేమికులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. భారీగా కురిసిన మంచుతో (Snowfall in China) కొండప్రాంతాలన్నీ శ్వేతవర్ణంలో మెరిసిపోతున్నాయి. హిమపాతంతో పర్యటక స్థలాలు మరింత ఆకర్షణీయంగా తయారయ్యాయి.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఈటీఎఫ్‌లో మదుపు.. రిస్క్‌ తక్కువ.. రిటర్న్స్‌ ఎక్కువ!

సంపన్నులతో పాటు రిటైల్‌ మదుపర్లు కూడా ఎక్స్‌ఛేంజ్‌ ట్రేడేడ్‌ ఫండ్స్‌(ఈటీఎఫ్‌)లో పెట్టుబడి పెట్టడంపై ఆసక్తి చూపిస్తున్నారు. గత ఏడాది కాలంలో ఈ రంగంలో రిటైల్‌ఫోలియోలు రెండింతలై 67 లక్షలకు చేరడమే ఇందుకు నిదర్శనం. అసలింతకీ ఈ ఈటీఎఫ్​లు ఎలా పని చేస్తాయి? వాటితో ప్రయోజనాలు ఏంటి?పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ద్రవిడ్, రోహిత్ కాంబోలో భారత్ ప్రపంచకప్​ గెలుస్తుంది'

టీ20 ప్రపంచకప్(t20 2world cup 2021)​లో తమ ఆఖరి మ్యాచ్​ను నమీబియాతో ఆడనుంది టీమ్ఇండియా. అటు కోచ్​గా రవిశాస్త్రి.. ఇటు టీ20 కెప్టెన్​గా కోహ్లీకి ఇదే చివరి మ్యాచ్. వీరి సారథ్యంలో ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేకపోయింది జట్టు. ఇదే విషయంపై స్పందించాడు గంభీర్(gautam gambhir on virat captaincy).పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • బేర్​గ్రిల్స్​తో సాహసాలకు మరో స్టార్​ హీరో రెడీ

మన దేశానికి చెందిన ప్రముఖులు ప్రధాని మోదీ(bear grylls modi episode), రజనీకాంత్, అక్షయ్ కుమార్​, అజయ్​దేవగణ్​లతో సాహసాలు చేయించిన సాహసికుడు బేర్ గ్రిల్స్​.. ఈసారి మరో బాలీవుడ్​ హీరో విక్కీ కౌశల్​తో(bear grylls vicky kaushal) స్టంట్​లు చేయించనున్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details