ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3pm - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

.

3pm_Topnews
ప్రధాన వార్తలు @ 3pm

By

Published : Mar 6, 2021, 3:01 PM IST

  • భగ్గుమన్న విభేదాలు
    విజయవాడ తెలుగుదేశం పార్టీలో విబేధాలు భగ్గుమన్నాయి. ఎంపీ కేశినేని నానిపై బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని నాని ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేశినేని ఆధ్వర్వంలో జరిగే కార్యక్రమంలో తాము పాల్గొనబోమని ప్రకటించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • పార్టీ ఆదేశిస్తే.. ఈ క్షణమే రాజీనామా చేస్తా: కేశినేని నాని
    తనపై కొందరు నేతలు చేసిన విమర్శలు.. వారి విచక్షణకే వదిలేస్తున్నానని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. తాను పార్టీ కోసమే కష్టపడుతున్నానని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • వసూళ్ల మయం: చంద్రబాబు
    విశాఖలో రెండో రోజు ఎన్నికల ప్రచారంలో తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. కోరమండల్ గేటు వద్ద రోడ్​ షోకు హాజరయ్యారు. వైకాపా పాలనలో ఎక్కడ చూసినా వసూళ్ల పర్వం కొనసాగుతుందని చంద్రబాబు ఆరోపించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి
    విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు పెడదారి పట్టాడు. తన వద్ద చదివుకునే ఆడపిల్లలతో అసభ్యకరంగా మాట్లాడుతూ.. చివరికి దెబ్బలు తిన్నాడు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లైదాంలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'షా' ఇంటింటి ప్రచారం
    భాజపా అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఆదివారం తమిళనాడు, కేరళలో ఎన్నికల ప్రచారానికి హాజరుకానున్నారు. ఈ రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న షా.. తమిళనాడులో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఆయన పర్యటన భాజపా శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ప్రభుత్వం రైతులను వేధిస్తోంది: రాహుల్​
    సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలు వందో రోజుకు చేరుకున్న నేపథ్యంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. రైతు బిడ్డలు దేశ సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి కాపలా కాస్తుంటే.. వారి కోసం దిల్లీ సరిహద్దుల్లో మేకులు పాతిందని ధ్వజమెత్తారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • విజయంపై ధీమా!
    పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్​ ఖాన్​.. శనివారం ఆ దేశ జాతీయ అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. తనకు వ్యతిరేకంగా ఓటు వేసిన వారిని అనర్హులుగా ప్రకటిస్తామని అధికార తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ​ హెచ్చరించిన నేపథ్యంలో ఆయన తన విజయంపై ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఇంకెంతకాలం ?
    కొంతకాలంగా దేశంలో ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర రూ.100కు చేరింది. డీజిల్ ధర కూడా మండిపోతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలే దీనికి కారణమని చెబుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • సెంచరీ కొట్టిన 'ఉప్పెన'
    విడుదలైన 23 రోజుల్లో 'ఉప్పెన', రూ.100 కోట్ల గ్రాస్​ మార్క్​ను అందుకున్నామని చిత్రనిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలోనే కొత్త పోస్టర్​ను పంచుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details