గుంటూరు నగరంలోని అరండల్‌పేట 12వ లైను మూడో అడ్డురోడ్డులో నిర్మించిన తెదేపా రాష్ట్ర కార్యాలయం... అక్రమ కట్టడమని వైకాపా లీగల్ సెల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు పోలూరి వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ భవనానికి ఎలాంటి అనుమతులు లేవని పేర్కొన్నారు. కార్పొరేషన్ ఆక్రమిత స్థలంలో... నగదు చెల్లించకుండా 15ఏళ్ల నుంచి ఈ కార్యాలయం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. నగరపాలక సంస్థ రికార్డుల్లో తెదేపా రాష్ట్ర కార్యాలయం గురించి ఎలాంటి సమాచారం లేదన్నారు. ఈ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ మూర్తికి ఫిర్యాదు చేశారు.
తెదేపా కార్యాలయ నిర్మాణం అక్రమం: వైకాపా - తెలుగుదేశం పార్టీ కార్యాలయం
గుంటూరు నగరంలోని అరండల్‌పేటలో నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం అక్రమ నిర్మాణమని... వైకాపా గుంటూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షడు పోలూరి వెంకటరెడ్డి ఆరోపించారు. దీనిపై నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ మూర్తికి ఫిర్యాదు చేశారు.
తెదేపా కార్యాలయ నిర్మాణం అక్రమం: వైకాపా
Last Updated : Jul 11, 2019, 9:40 AM IST