ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Video Viral: సీఎం జగన్​పై మహిళ కామెంట్స్​.. సోషల్​ మీడియాలో వైరల్​

By

Published : May 17, 2022, 8:27 AM IST

Women Angry On CM Jagan: ముఖ్యమంత్రి జగన్​పై ఓ మహిళ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పథకాలు.. పేద ప్రజలకు మేలు చేసేలా లేవని ఆమె వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వంపై గుంటూరు కలెక్టరేట్​లో మహిళ చేసిన విమర్శలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

సీఎం జగన్​పై మహిళ కామెంట్స్
సీఎం జగన్​పై మహిళ కామెంట్స్

సీఎం జగన్​పై మహిళ కామెంట్స్​.. సోషల్​ మీడియాలో వైరల్​

గుంటూరు కలెక్టరేట్‌కు వచ్చిన ఓ మహిళ.. జగన్‌ ప్రభుత్వంపై చేసిన విమర్శలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. తాడికొండ మండలం కంతేరుకు చెందిన కె.వెంకాయమ్మ.. భూ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు వెళ్లారు. భూమిని సర్వే చేసి ఎవరిది ఎంతవరకో తేల్చాలని స్పందన కార్యక్రమంలో అర్జీ అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పథకాలు పేదప్రజలకు మేలు చేసేలా లేవని వ్యాఖ్యానించారు. అన్నా క్యాంటీన్లు తీసేయటం, రంజాన్-క్రిస్మస్ కానుకల్ని ఎత్తేయటం సరికాదంటూ తనదైన రీతిలో చెబుతూ జగన్​ మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details