గుంటూరులోని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు ఇంటి వద్ద సోమవారం రాత్రి హై డ్రామా నడిచింది. విశాఖలో గంజాయి రవాణాకు సంబంధించి ఆనంద్ బాబు సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంతో పాటు విజయసాయిరెడ్టిపై ఆనంద్ బాబు ఆరోపణలు చేశారు. దీనిపై నోటీసులు జారీ చేసేందుకు ఆనంద్ బాబుకు ఇంటికి విశాఖ జిల్లా నర్సీపట్నం సిఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి వచ్చారు. రాత్రి సమయంలో పోలీసులు రావటంపై ఆనంద్ బాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే గంజాయి రవాణాకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని పోలీసులు ఆనంద్ బాబును కోరారు.
తెదేపా నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఇంటికి సోమవారం రాత్రి విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు వచ్చారు. విశాఖ మన్యం నుంచి గంజాయి, మత్తు పదార్థాల రవాణాపై ఆనంద్‌బాబు సోమవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్‌బాబు వైకాపా ప్రభుత్వంతో పాటు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేశారు. దీంతో వసంతరాయపురంలోని ఆనంద్‌బాబు ఇంటికి వచ్చిన నర్సీపట్నం పోలీసులు.. గంజాయి రవాణాకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. మీడియాలో ఏ ఆధారాలతో మాట్లాడారో చెబితే స్టేట్‌మెంట్ రికార్టు చేసుకుంటామని తెలిపారు. పోలీసుల నోటీసు తీసుకునేందుకు ఆనంద్‌బాబు నిరాకరించారు. దీంతో పోలీసులు మంగళవారం ఉదయం మళ్లీ వస్తామని చెప్పి వెళ్లారు.