వెలుగు యానిమేటర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో నిరసన చేపట్టారు. పలు గ్రామాలకు చెందిన యానిమేటర్లు గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయానికి తరలివచ్చి అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించారు. తమకు 10 వేల వేతనాన్ని పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించగానే... తమపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తూ... విధులకు రావద్దని హెచ్చరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. 15 ఏళ్లుగా పనిచేస్తున్నామన్న తమకు.. పెండింగ్ జీతాలు తక్షణం చెల్లించాలని, ఇప్పటికే తొలగించిన వారిని విధుల్లోకి తీసుకొని, తమ సర్వీసులను ఆన్లైన్ చేయాలని కోరారు.
''మమ్మల్ని విధులకు రావొద్దని ఒత్తిడి తెస్తున్నారు'' - voa
యానిమేటర్లకు 10 వేల వేతనాన్ని పెంచుతున్నామని ప్రకటించగానే విధులకు రావద్దని ప్రజాప్రతినిధులు తమపై ఒత్తిడి చేస్తున్నారని వెలుగు యానిమేటర్ల యూనియన్ (వీఓఏ).. అధికారులకు ఫిర్యాదు చేసింది. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ మేరకు అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
గుంటూరులో వెలుగు యానిమేటర్ల యూనియన్ ఆందోళన