గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండలో ముగ్గురు మైనర్లు(ఒక బాలుడు, ఇద్దరు బాలికలు) కనిపించడం లేదంటూ పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల21న బక్రీద్ సందర్భంగా మంగళగిరికి వెళ్లిన తమ పిల్లలు తిరిగి ఇంటికి రాలేదని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Missing: తాడేపల్లిలో ముగ్గురు మైనర్ల అదృశ్యం - గుంటూరు జిల్లా
ముగ్గురు పిల్లలు కనిపించడం లేదంటూ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన సంఘటన తాడేపల్లి మండలం కొలనుకొండలో జరిగింది. ఈనెల 21నుంచి తమ పిల్లలు కనిపించడం లేదంటూ ఫిర్యాదులో పిల్లల తల్లిదండ్రులు పేర్కొన్నారు.
మైనర్ల అదృశ్యం
తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లల ఆచూకీ తెలుసుకునేందుకు రెండు బృందాలను నియమించామని సీఐ శేషగిరిరావు చెప్పారు. త్వరలోనే పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు.
ఇదీ చదవండి:murder: కత్తితో దాడి.. బాలుడు మృతి..