ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వైకాపా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది' - వైకాపా నేతలు కక్ష్యసాధింపు చర్యలు

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని తెదేపా నేతలు ఆరోపించారు. వైకాపా నేతలు పరిపాలనను గాలికొదిలేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిప్డడారు. రాష్టంలో ప్రజలు, దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారు.

tdp comments on ycp
వైకాపా ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతుంది

By

Published : Jan 6, 2021, 4:13 PM IST

ఇళ్ల పట్టాల పంపిణీ ముసుగులో జగన్ ప్రభుత్వం రూ. 6,500 కోట్ల అవినీతికి పాల్పడిందని తెదేపా ఎమ్మెల్సీ బీటీ.నాయుడు ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలతో చర్చకు రావడానికి తెదేపా సిద్ధంగా ఉందన్నారు. వైకాపా నుంచి ఎవరొస్తారో చెబితే అవినీతి బాగోతాన్ని బయటపెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ సహా, వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులకు కనకాభిషేకం జరిగిందని నిరూపిస్తామని పేర్కొన్నారు. ఇళ్లపట్టాల ముసుగులో జరిగిన అవినీతి వ్యవహారంపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

గుంటూరు జిల్లాలో..

వైకాపా ప్రభుత్వంలో ప్రతిరోజు ఏదో ఒక చోట దాడులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయని తెదేపా నేత మాకినేని పెద్ద రత్తయ్య అన్నారు. రాష్టంలో ప్రజలకు, దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ఈ తరహా దాడులపై కొందరు మంత్రులు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. వైకాపా మంత్రుల చేష్టలకు భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. మతాలకు, కులాలకు మద్దతుగా ఉండాల్సిన ప్రభుత్వం ఒక మతాన్ని పెంచి పోషిస్తోందని వాళ్లు ఆరోపించారు.

ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరతీసిందని ఆయన ఆరోపించారు. ఇళ్ల పట్టాలు పేరుతో వైకాపా చేస్తున్న అవినీతిని త్వరలోనే వెలుగులోకి తీసుకువస్తామని తెదేపా గుంటూరు పార్లమెంటరీ ఇన్​ఛార్జ్​ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు.

కుల, మతాలను టార్గెట్ చేసి వైకాపా నేతలు పాలన చేస్తున్నారని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టలేక.. ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. రేపల్లె పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలులో వైకాపా ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర, పేద ప్రజల సంక్షేమం కోసం తెదేపా ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందన్నారు. ఈ రౌడీ రాజకీయాలకు ప్రజలే ముగింపు ఇస్తారని సత్యప్రసాద్ తెలిపారు.

ఇదీ చూడండి:127 ఘటనల్లో ఒక్కరినైనా అరెస్ట్ చేశారా..?: కన్నా లక్ష్మీనారాయణ

ABOUT THE AUTHOR

...view details