ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా అరాచకాలపై..రేపు డాక్యుమెంటరీ విడుదల - tdp

రాష్ట్ర ప్రభుత్వ పాలనను తుగ్లక్ పాలన అనాలో... ఇంకేమైనా అనాలో ప్రజలో నిర్ణయించుకోవాలని తెదేపా నేతలు అన్నారు. రాజకీయ కక్షతోనే పల్నాడులోని మూడు నియోజకవర్గాల్లో తెదేపా కార్యకర్తలపై దాడులు... ఆస్తులు ధ్వంసం చేశారని ఆరోపించారు. వైకాపా అరాచకాలపై రేపు డాక్యుమెంటరీ విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

వైకాపా అరాచకాల పై డాక్యుమెంటరీ..రేపు విడుదల

By

Published : Sep 9, 2019, 5:29 PM IST

వైకాపా అరాచకాల పై డాక్యుమెంటరీ..రేపు విడుదల

వైకాపా అరాచకాలపై డాక్యుమెంటరీ తయారు చేశామని...దానిని రేపు విడుదల చేస్తామని తెలుగుదేశం నేతలు తెలిపారు. ఐదేళ్ళ తరువాత వైకాపా నేతలకు బాధితులు ఇప్పుడు గుర్తొచ్చారా అని వారు నిలదీశారు. అనైతిక చర్యలకు పాల్పడుతున్న హోం మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. పల్నాడుపై ఐజీ, ఎస్పీల ప్రకటనలు సిగ్గు చేటని వారు అన్నారు. ఛలో ఆత్మకూరుకు పోలీసుల అనుమతి అవసరం లేదన్న నేతలు... బాధితులకు భరోసా కల్పిస్తే చాలని స్పష్టం చేశారు. 11న ఛలో ఆత్మకూరుకు సిద్దమైనట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details