మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాణాలకు ప్రమాదముందని తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు గుంటూరు జీజీహెచ్‌కు తెదేపా నేతలు వచ్చారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులు అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అచ్చెన్నాయుడికి ఏదైనా జరిగితే సీఎం జగనే సమాధానం చెప్పాల్సి ఉంటుందని తెదేపా నేతలు అన్నారు. అధికారులను అడ్డం పెట్టుకుని తమ పార్టీ నేతలను వేధిస్తున్నారని విమర్శించారు. జీజీహెచ్‌కు కరోనా కేసులు వస్తున్నాయని.. అచ్చెన్నకు కొవిడ్ టెస్ట్ చేయాలని వైద్యులను కోరారు. అయితే అచ్చెన్నాయుడికి ఇప్పటికే 2 సార్లు పరీక్ష నిర్వహించామని డాక్టర్లు తెలిపారు.