ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కోడెల ఆశయాల సాధనకు కృషి చేస్తాం: తెదేపా - kodela death anniversary

గుంటూరులోని తెదేపా కార్యాలయంలో తెదేపా నేత, మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రథమ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. కోడెల ఆశయాల సాధనకు కృషి చేస్తామని నేతలు అన్నారు.

tdp leaders paying tribute
tdp leaders paying tribute

By

Published : Sep 16, 2020, 11:58 AM IST

వైకాపా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడటమే మాజీ సభాపతి కోడెలకు నిజమైన నివాళి అని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అభిప్రాయపడ్డారు. ప్రజాజీవితంలో ప్రత్యేక ముద్రను వేసుకున్న కోడెలను వైకాపా ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని ఆరోపించారు.

ఇవాళ కోడెల శివప్రసాదరావు ప్రథమ వర్థంతి సందర్భంగా గుంటూరు జిల్లా తెదేపా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. రాజకీయ జీవితంలో ఎన్నో పదవులను అనుభవించిన కోడెల... వాటికి వన్నె తెచ్చారని నేతలు గుర్తు చేశారు. కోడెల ఆశయాల సాధనకు అంకితభావంతో పని చేస్తామని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details