ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP Pattabhi fired on Sajjala: 'సజ్జలకేం తెలుసు.. భూములు కోల్పోయిన రైతుల బాధ'

TDP Pattabhi fired on Sajjala : సజ్జల రామకృష్ణారెడ్డిపై తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ మండిపడ్డారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని దళారీ పనులు చేయడం.. వేల కోట్లు దిగమింగడం తప్ప.. భూములు కోల్పోయిన రైతుల బాధ ఆయనకేమీ తెలుస్తుందని ధ్వజమెత్తారు.

By

Published : Mar 6, 2022, 9:00 AM IST

TDP Pattabhi fired on Sajjala
సజ్జలకేం తెలుసు?...భూములు కోల్పోయిన రైతుల బాధ..

TDP Pattabhi fired on Sajjala : అధికారాన్ని అడ్డుపెట్టుకుని దళారి పనులు చేయడం, వేలకోట్లు దిగమింగడం తప్ప సజ్జల రామకృష్ణారెడ్డికి మరోటి తెలియదని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ మండిపడ్డారు. భూములు కోల్పోయిన అమరావతి రైతుల బాధ ఆయనకు ఏం తెలుస్తుందని పట్టాభి ధ్వజమెత్తారు.

‘న్యాయం జరిగిందనే సంతోషంలో న్యాయదేవతకు మోకరిల్లడమే రైతుల తప్పా? 189 మంది ప్రాణాలర్పించి.. 800 రోజులకు పైగా చేసిన రైతుల ఉద్యమం వెకిలిగా కనిపించిందా? బెయిలుపై జీవించే మీ నాయకుడు, హైకోర్టు స్టేపై నడిచే మీడియాకు వత్తాసు పలికే మీకు.. ఇతర మీడియా సంస్థలు, యాజమాన్యాలపై మాట్లాడే అర్హత ఉందా?’ అని నిలదీశారు. మంగళగిరిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ‘రాజధాని భూముల అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ తమ బాధ్యతల్ని నిర్వర్తించడంలో విఫలం కావడం పచ్చి మోసం అని హైకోర్టు తీర్పులోని 173వ పేజీ 265వ పేరాలో ఉంది. దీనికి సజ్జల ఏం సమాధానమిస్తారు?’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన హైకోర్టు తీర్పును ఉటంకిస్తూ.. పలు ప్రశ్నలు సంధించారు.

‘అమరావతి రాజధానికి సంబంధించి ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.15 వేల కోట్లని తీర్పులోని 178వ పేజీలో రాష్ట్ర హైకోర్టు స్పష్టంగా చెప్పింది. నిర్మాణ పనులకు రూ.5,674 కోట్లు, చేసిన పనులకు చెల్లించాల్సిన మొత్తం రూ.1,850 కోట్లు, మొబిలైజేషన్‌ అడ్వాన్సుల కింద రూ.5,200 కోట్లు ఇచ్చారని.. రైతులకు ఇప్పటివరకు రూ.800 కోట్లు చెల్లించారని, ఇంకా రూ.1,100 కోట్లు చెల్లించాలని తెలిపింది. పింఛన్ల రూపంలో రైతులకు ఇచ్చింది రూ.290 కోట్లు అయితే.. ఇంకా రూ.290 కోట్లు ఇవ్వాలంది. అంత స్పష్టంగా హైకోర్టు చెప్పాక కూడా.. వర్చువల్‌ గ్రాఫిక్స్‌ అంటున్నారు. న్యాయస్థానంలో ఆ లెక్కలన్నీ తప్పని, అమరావతిలో అంతా గ్రాఫిక్సే అని మీ లాయర్లు ఎందుకు చెప్పలేకపోయారు?’ అని పట్టాభిరామ్‌ ప్రశ్నించారు. ‘నిధుల సమీకరణకు ఉన్న మార్గాలేంటో, అందుకు ఎలాంటి విధానాలు అవలంబించాలో గత ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాల్లో ఉందని హైకోర్టు తన తీర్పులోని 188వ పేజీ 292వ పేరాలో వివరించింది. ఆ అవకాశాలను ఈ ప్రభుత్వం ఎందుకు వినియోగించుకోలేకపోతోందని ప్రశ్నించింది’ అన్నారు.

ఇదీ చదవండి :

Polavaram: పోలవరంపై పది రోజుల్లో కీలక భేటీ.. డిజైన్లు, నిధులే సవాల్‌

ABOUT THE AUTHOR

...view details