Special police Protest in guntur : మద్యం, ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి మిలటరీ, పారా మిలటరీలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారిని ప్రభుత్వం ప్రత్యేక పోలీసులుగా నియమించింది. గతేడాది జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా 2,156 మందిని పొరుగు సేవల సిబ్బందిగా నియమించారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తమకు వేతనాలు ఇవ్వడం లేదంటూ స్పెషల్ పోలీసులు గుంటూరు కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనంతో జీవించడం కష్టతరంగా మారిందని, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న విధంగా వేతనాలు పెంచాలని కోరారు. మహిళా పోలీసుల మాదిరిగా తమను రెగ్యులైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
SPECIAL POLICE IN GUNTUR : 'మా సమస్యలు పరిష్కరించండి' - guntur
Special police Protest in guntur : అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ... స్పెషల్ పోలీసు అధికారుల సంఘం గుంటూరు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. అనంతరం జిల్లా పాలనాధికారికి వినతిపత్రం అందించారు.
స్పెషల్ పోలీసు అధికారుల ఆందోళన