మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబే గెలవాలని సభాపతి కోడెల ఆకాంక్షించారు. కొందరు సభ్యులు శాసనసభకు రాకపోవడం చాలా దురదృష్టకరమని సభాపతి కోడెల శివప్రసాదరావు గుంటూరులో అభిప్రాయపడ్డారు. పార్టీ మారిన వారి పై చర్యల విషయం, 4సార్లు సభకు గైర్హాజరు పై అనర్హత రెండూ... సభ్యుల విచక్షణ కు వదిలి వేశామన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేదని.. పక్క రాష్ట్రాల్లో చూస్తే మన రాష్ట్రంలో అభివృద్ధి ఎంటో తెలుస్తుందని సభాపతి అన్నారు. అందుకే మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబే రావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఎక్కడ పోటీ చేయాలనేది చంద్రబాబు నిర్ణయిస్తారని కోడెల స్పష్టం చేశారు.