జాతీయ సఫాయి కర్మచారి ఛైర్మన్ వెంకటేషన్ గుంటూరు నగరంలో పర్యటించారు. గుంటూరు నల్లచెరువు మాన్యంలోని సఫాయి కార్మికులతో ఆయన మాట్లాడి.. కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదని తెలిపిన కార్మికులు తెలపడంతో.. వారికి రావాల్సిన అన్ని సంక్షేమ పథకాలు అములు చేయాలన్నారు. నెల రోజుల్లో కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆదేశించారు. పథకాలు అమలు చేయకపోతే గవర్నర్, సీఎంకు ఫిర్యాదు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు సరిగా స్పందించకపోతే జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని కమిషనర్ తెలిపారు. కార్మికులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
సమస్యలుంటే నేరుగా మాకు తెలపండి: జాతీయ సఫాయి కర్మచారి ఛైర్మన్
జాతీయ సఫాయి కర్మచారి ఛైర్మన్ గుంటూరు నగరంలో పర్యటించారు. కార్మికుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే నేరుగా తమకే తెలపాలని సూచించారు.
జాతీయ సఫాయి కర్మచారి ఛైర్మన్
Last Updated : Sep 30, 2021, 5:40 PM IST