కరోనా వైరస్ శ్రామికుల పాలిట శత్రువుగా మారింది. పొట్ట చేతపట్టుకుని పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన శ్రమజీవులను కదలనీయకుండా చేసింది. హఠాత్తుగా కేంద్రం లాక్‌డౌన్ సొంత ఊళ్ళకు వెళ్లే మార్గం లేదు. ఉండిపోదామన్నా చేసుకోవడానికి పనుల్లేవు. పనిలేకపోతే పస్తులే గతి. స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు ఇచ్చే ఆహరంతో నెట్టుకొస్తున్నారు బిహర్, ఒడిశాకు చెందిన వలస కూలీలు. ఆ వలస కూలీల ఎదుర్కొంటున్న ఇబ్బందుల పై ఈటీవీ భారత్ ప్రతినిధి సూర్యారావు అందించే కథనం...
వలస కూలీల బతుకు ఛిద్రం..! - వలస కార్మికుల కష్టాలు
లాక్ డౌన్ కారణంగా బిహార్, ఒడిశాలకు చెందిన మిర్చి కూలీలు అల్లాడుతున్నారు. తమ స్వస్థలాలకు వెళ్లలేక.. ఇక్కడ ఆహార వసతి కరవై ఉండలేక సతమతమవుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు ఇచ్చే ఆహారంతో నెట్టుకొస్తున్నారు. గుంటూరులో బిహార్, ఒడిశాలకు చెందిన మిర్చి వలస కూలీల పరిస్థితిపై ఈటీవీ భారత్ ప్రతినిధి సూర్యారావు మరిన్ని వివరాలు అందిస్తారు.
వలస కూలీల బతుకు ఛిద్రం