పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. తెదేపాకి అనుకూలంగా ఉందని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్‌ను అమలు చేస్తున్నారని అన్నారు. గుంటూరు జిల్లా రేపల్లెలో ఆయన మాట్లాడారు.
తెదేపా కార్యకర్తలా ఎస్ఈసీ నిమ్మగడ్డ తీరు: ఎంపీ మోపిదేవి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం కార్యకర్తలా పనిచేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు ఎంపీ మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. ఎన్నికల సంఘం నిర్ణయాలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
'ఎన్నికల సంఘం నిర్ణయాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం'
నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం కార్యకర్తలా పనిచేస్తున్నారని ఎంపీ మోపిదేవి వ్యాఖ్యానించారు. అలాగే ఎస్ఈసీ నిర్ణయాలను సమర్థించేలా న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వడం సరికాదన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయాలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు యావత్ దేశానికే ఆదర్శంగా ఉన్నాయని కొనియాడారు.
ఇదీ చదవండి:విజిలెన్స్ దాడులు ఆపకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం: లోకేశ్