NOTICE: తెదేపా కార్యాలయంపై దాడి ఘటనలో 10 మందికి నోటీసులు - attack on tdp office on octobar 20th
22:46 October 22
నోటీసులిచ్చిన మంగళగిరి గ్రామీణ పోలీసులు
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వైకాపా కార్యకర్తల్లో పదిమందిని గుర్తించిన మంగళగిరి పోలీసులు.. వాళ్లకు నోటీసులు ఇచ్చారు. వీరిలో ఐదుగురు గుంటూరుకు చెందిన వారు, మరో ఐదుగురు విజయవాడ నగరానికి చెందిన వారిగా గుర్తించారు. నోటీసులు ఇచ్చిన వారిలో పానుగంటి చైతన్య, పల్లెపు మహేష్ బాబు, పేరూరి అజయ్, శేషగిరి పవన్ కుమార్, అడపాల గణపతి, షేక్ అబ్దుల్లా, కోమటిపల్లి దుర్గారావు, జోగా రమణ, గోకా దుర్గాప్రసాద్, లంకా ఆదినాయుడు ఉన్నారు. తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేసిన సమయంలో లభించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వీరిని గుర్తించారు. త్వరలోనే మరికొంత మందికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు.
ఇదీ చదవండి: