ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 7, 2021, 4:49 PM IST

ETV Bharat / city

'గుంటూరు జిల్లాలో ఐదు మున్సిపల్ ఛైర్మన్ పదవులు వైకాపావే'

గుంటూరులో జరిగిన ఆర్యవైశ్య మహా సమ్మేళనంలో.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అగ్రవర్ణ పేదల కోసం సీఎం జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. పురపాలక ఎన్నికల్లో వైకాపా ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ninister vellampalli participated in arya vysya meet at guntur
గుంటూరులో ఆర్యవైశ్య మహా సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి

రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కుప్పం సహా 80 శాతానికి పైగా గ్రామాల్లో.. వైకాపా మద్దతుదారులు గెలిచారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గుంటూరులో జరిగిన ఆర్యవైశ్యుల మహా సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా సీఎం జగన్‌ వాటికి ఎదురునిలిచి.. అనేక ప్రజారంజక కార్యక్రమాలు చేస్తున్నారని స్పష్టం చేశారు. తెల్ల రేషన్​కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందడం సంతోషంగా ఉందన్నారు. అగ్రవర్ణ పేదల్లో 45 ఏళ్లు దాటిన మహిళలకు జగనన్న చేయూత వర్తింపజేసేందుకు.. మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆర్యవైశ్యుల పట్ల సీఎం సానుకూల దృక్పథంతో ఉన్నారన్నారు. వారంతా మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పురపాలక ఎన్నికల్లో ప్రతిపక్షాలు గెలిస్తే అభివృద్ధి కుంటుపడుతుందని మంత్రి ఆరోపించారు. గుంటూరు జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పదవిని వైకాపా మద్దతుదారులే దక్కించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. తెదేపా అధినేత భాజపాతో కలిసి ఉన్నప్పుడు జై శ్రీరామ్ అన్నారని... ఇప్పుడేమో అది మతతత్వ పార్టీ అని ముద్ర వేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు వారిని ఎప్పుడో పదవి నుంచి దింపేసిన విషయాన్ని చంద్రబాబు, లోకేశ్​లు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సిద్ధా రాఘవరావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details