Minister Vellampalli on CBN: గుంటూరు సత్తెనపల్లిలో రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు క్లాక్ టవర్‌ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో విజయవాడలో దేవాలయాలను కూల్చారని ఆరోపించారు. భాజపా, తెదేపా, జనసేన పార్టీలు కలసి దేవాలయాలను, గోశాలను కూల్చి దుర్మార్గపు పరిపాలన చేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
చంద్రబాబు అమరావతి అని చెప్పి భ్రమరావతిని సృష్టించి గ్రాఫిక్స్‌తో పరిపాలన చేశారని విమర్శించారు. అమరావతి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ భ్రమలో ఉంచిన వ్యక్తి చంద్రబాబు అని అరోపించారు. చంద్రబాబు నాలుగు బిల్డింగులు కట్టి రాజధాని అంటున్నాడన్నారు. తాత్కాలిక బిల్డింగులు కట్టి తాత్కాలిక ముఖ్యమంత్రిగా పనిచేసి వెళ్లిపోయిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.