ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చిక్కుకున్న వలస కూలీలు సొంతూళ్లకు పయనమయ్యారు. లాక్డౌన్తో వీరు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేసింది. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరులో వలస కూలీలను తరలించేందుకు అధికారులు 20 బస్సులు ఏర్పాటు చేశారు.
కరోనా నేపథ్యంలో వ్యక్తిగత దూరం పాటించేలా ఒక్కో బస్సుకు 30 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. ముందుగా కూలీలకు కరోనా పరీక్షలు చేసిన అనంతరం వారిని తరలించే ఏర్పాట్లు చేశారు.