గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన వినాయక నిమజ్జనంలో... మద్యం ఏరులై పారింది. అధికార పార్టీ నాయకులు విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేశారు. డ్రమ్ములో మద్యాన్ని నింపి.. నిమజ్జన ఉత్సవాలకి వచ్చిన వారికి ప్రసాదం పంచినట్లుగా పంపిణీ చేశారు. క్యూ కట్టి మరీ మందుబాబులు పెద్ద ఎత్తున బారులు తీరారు. బహిరంగ మద్యాన్ని అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. దీనికి పక్కనే గానా భజనా కూడా ఉండటంతో.. ఆహుతులు భారీగా హాజరైయ్యారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమంలో చెక్కర్లు కొట్టడం.. అధికార పార్టీ నేతలు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ దృశ్యాలు పాతవని.. ఎక్కడివో తమకి తెలిదని నమ్మబలుకుతున్నారు.
వైకాపా వినాయక నిమజ్జనం.. డ్రమ్ముల్లో మద్యం.. ఏరులై పారడం అంటే ఇదేనేమో! - ఏపీ తాజా వార్తలు
సాధారణంగా మద్యం అంటే సీసాల్లో ఉంటుంది. పంపిణీ చేయాలనుకున్న వారు బాటిళ్లను పంచిపెడతారు. లేదా గ్లాసుల్లో పోసి ఇస్తుంటారు. ఇక్కడ మాత్రం వెరైటీగా డ్రమ్ముల్లో పోసి, మద్యానికి పంప్ వదిలారు. ఏకంగా వినాయక నిమజ్జనంలో మద్యం ఏరులై పారింది. తాగండి, ఊగండి.. అన్నట్లుగా అధికార పార్టీ నాయకులు విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
డ్రమ్ముల్లో మద్యం
Last Updated : Sep 6, 2022, 8:22 PM IST