వైకాపా ప్రభుత్వం వచ్చాక విపక్ష నేతలపై వేధింపులు పెరిగాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో మాట్లాడిన ఆయన... రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఎవరైనా అవినీతి చేసి ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కానీ కక్షపూరిత ధోరణితో వ్యవహరించకూడదని హితవు పలికారు. 2014లో తెదేపా సర్కారు ఇలాంటి చర్యలకే పాల్పడిందని ఆరోపించారు. ఇప్పుడు వైకాపా అలాగే చేస్తే వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని హెచ్చరించారు. రాజన్న రాజ్యం తెస్తానని పోలీసు రాజ్యం తెచ్చారని కన్నా విమర్శించారు. శత్రువులను సైతం వైఎస్ అక్కున చేర్చుకునేవారన్న కన్నా... అవినీతిపరులను వదిలేసి డీలర్లు, కిందిస్థాయి ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం ప్రస్తుత ప్రభుత్వానికి సరికాదన్నారు. గతంలో... పొత్తులు పెట్టుకోవడం వల్లే భాజపా నష్టపోయిందని అభిప్రాయపడ్డారు. 2024 నాటికి రాష్ట్రంలో సొంతగా ఎదగాలన్నదే భాజపా లక్ష్యమని తెలిపారు.
వైకాపా పాలన రాజన్న రాజ్యం కాదు... పోలీసు రాజ్యం: కన్నా
వైకాపా ప్రభుత్వం వచ్చాక విపక్షనేతలపై వేధింపులు పెరిగాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అవినీతి జరిగినట్లు రుజువైతే చర్యలు తీసుకోవాలి కానీ... కక్షపూరిత ధోరణి సరికాదన్నారు.
వైకాపా పాలన రాజన్న రాజ్యం కాదు...పోలీసు రాజ్యం : కన్నా