గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో కాపు సంక్షేమ సేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. బ్రిటిష్ కాలం నుంచి కాపులను విభజించి పాలించారన్న జనసేనాని... శాసించే స్థాయి నుంచి యాచించే స్థాయి వరకు కాపులను తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కాపుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్న పవన్... అణగారిన వర్గాల అభివృద్ధికి కాపు సంక్షేమ సేన పనిచేయాలని పిలుపునిచ్చారు. కాపు నేతల వద్దకే రాజకీయ పార్టీలు రావాలని వ్యాఖ్యానించారు. మరోవైపు... కాపు నేస్తంలో మహిళలకు కొంతవరకు సహాయం అందిందన్న పవన్ కల్యాణ్... తన విజయం కోరే వ్యక్తి చిరంజీవి అని స్పష్టం చేశారు.
కాపులు శాసించే స్థాయికి ఎదగాలి: పవన్‌కల్యాణ్ - మంగళగిరి నేటి వార్తలు
తన విజయం కోరే వ్యక్తి అన్నయ్య.. చిరంజీవి అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. కాపు సంక్షేమ నేతలతో మంగళగిరిలో పవన్ సమావేశమయ్యారు. శాసించే స్థాయి నుంచి యాచించే స్థాయి వరకు కాపులను తీసుకువచ్చారన్న పవన్... కాపు నేస్తంలో మహిళలకు కొంత సహాయం అందిందని వ్యాఖ్యానించారు.
కాపు నేస్తంలో మహిళలకు కొంతవరకు సాయం అందింది: పవన్
Last Updated : Jan 30, 2021, 2:47 AM IST