ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గోదాంలో భారీ చోరీ.. నగదును పట్టుకున్న పోలీసులు.. ఎలాగంటే? - గుంటూరు జిల్లా తాజా వార్తలు

THEFT: ఓ గోదాంలో భారీ దొంగతనం జరిగింది. అందులో ఉన్న నగదు పెట్టెను గుర్తుతెలియని దుండగులు అపహరించారు. అయితే దొంగిలించిన పెట్టె బరువు ఉండటంతో అక్కడే సమీపంలోని అరటి తోటలో దాచిపెట్టి వెళ్లారు. తెల్లారి గోదాంలో దొంగతనం జరిగిందన్న విషయం తెలుసుకున్న నిర్వహకుడు.. పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులు దానిని కనిపెట్టారో.. లేదో తెలుసుకోవాలంటే ఇది చదవండి..

THEFT
THEFT

By

Published : Jul 21, 2022, 7:27 PM IST

THEFT: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని ఓ గోదాంలో.. భారీ దొంగతనం జరిగింది. రేవేంద్రపాడులోని ఆహార పదార్థాల నిల్వ గోదాములో నగదు పెట్టెను దుండగులు అపహరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు తనిఖీ చేపట్టగా.. గోదాము సమీపంలోని అరటి తోటలో అది లభించింది. దుండగుల పాదముద్రల ఆధారంగా నగదు పెట్టెను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అందులో ఉన్న సుమారు 8 లక్షల రూపాయలు అలాగే ఉన్నాయని తెలిపారు. పెట్టెపై ఉన్న 6 వేలిముద్రలు ఆధారంగా నిందితుల్ని పట్టుకునేందుకు పయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

గోదాంలో భారీ చోరీ.. నగదును పట్టుకున్న పోలీసులు.. ఎలాగంటే?

ABOUT THE AUTHOR

...view details