గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చామన్నారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు ద్వారా ప్రగతి ఫలాలు అందరికీ అందుతాయన్నారు. గుంటూరు జిల్లాలో సాగునీటి రంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. స్వతంత్ర సమరయోధులతో పాటు వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారిని మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్ ఆనంద్ కుమార్తో పాటు ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, ముస్తఫా, విడదల రజని ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
'గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోంది'
గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ముఖ్యఅతిథిగా హోంశాఖ మంత్రి సుచరిత పాల్గొన్నారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు.
'గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోంది'