మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పొరాడి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకుందామని హోంమంత్రి(home minister) సుచరిత అన్నారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ పోరాడాలని కోరారు. మద్య విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో.. గుంటూరులో నిర్వహించిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా నిరోధకంపై ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి సారించారని ఆమె తెలిపారు. డ్రగ్స్ వినియోగం వల్ల యువత ఉజ్వల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ వనరులు నిర్వీర్యమౌవుతున్నాయని.. శ్రామిక ఉత్పాదక శక్తి తగ్గుతుందన్నారు. డ్రగ్స్ వినియోగాన్ని వదిలి ఆరోగ్యకరమైన సమాజాన్ని స్థాపిద్దామని హోంమంత్రి అన్నారు.