ప్రకాశం జిల్లా మార్కాపురం, పెద్దారవీడు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎండతాకిడి తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ప్రజలు సేద తీరారు. వేములకోట, కొట్టాపల్లి, చింతకుంటతో పాటు పలు గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. అకాల వర్షానికి మిర్చి పంట తడిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం.. విద్యుత్ సేవలకు అంతరాయం - prakasham district rain news
రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాల్లో గాలులతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ప్రకాశం గుంటూరు జిల్లాల్లో భారీ వర్షం
గుంటూరు జిల్లా పిరంగిపురం మండలం వేములురిపాడులో కొద్దిసేపు వడగండ్ల వాన కురిసింది.
ఇదీ చదవండి:'కరోనా రహిత నగరమే లక్ష్యంగా వ్యాక్సినేషన్ కార్యాచరణ'