పాత గుంటూరులో వైకాపా నేతల తీరు పరాకాష్టకు చేరింది. కార్తిక మాసం పురస్కరించుకుని అన్ని ఆలయాల వద్ద దేవుడి బొమ్మలు అలంకరిస్తే ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా వైకాపా నేతల ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. దేవాలయం గోడలను ఎమ్మెల్యే ముస్తఫా, సీఎం జగన్ ఫ్లెక్సీలతో కప్పేశారు. మరీ అభిమానం ఉంటే పార్టీ కార్యాలయాల్లో కట్టుకోవాలి కానీ ఇలా చేయడం వారి పిచ్చికి పరాకాష్టే అని అటూ విమర్శలు ముంచెత్తుతున్నాయి. దీనిపై కొంతమంది స్థానికులు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నారు.
వైకాపా కార్యాలయం కాదోయ్...శివాలయమే..! - గుంటూరు శివాలయానికి వైకాపా బేనర్లు
కార్తికమాసం పురస్కరించుకుని దేవాలయాలకు దేవుడి బొమ్మలతో అలంకరిస్తే... గుంటూరులో దానికి భిన్నంగా వైకాపా నేతలు ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. పాత గుంటూరులోని శివాలయం(ఆగస్తేశ్వరస్వామి దేవాలయం)లో కార్తికమాసం పురస్కరించుకుని దేవాలయాలన్ని దేవుడి బొమ్మలతో అలకరించాల్సింది పోయి.. దేవాలయం గోడలకు ఎమ్మెల్యే ముస్తఫా, సీఎం జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లుతో కప్పిశారు.
వైకాపా కార్యాలయం కాదోయ్...శివాలయమే..!