గుంటూరు నగరంలో వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం మూడున్నర కోట్ల రూపాయలతో కార్యాచరణ రూపొందించినట్లు మేయర్ కావటి మనోహర్ నాయుడు తెలిపారు. నగరపాలక సంస్థ పాలకమండలి సమావేశంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తాగునీటి సమస్యపై ప్రస్తావించారు. శివారు ప్రాంతాల్లో ఇంకా తాగునీటి సమస్య ఉందని, మరికొన్ని చోట్ల పైప్ లైన్లు పాడైపోయాయని వివరించారు. దానికి సమాధానం ఇచ్చిన మేయర్... పైపులైన్లు మరమ్మతులు చేయిస్తున్నామని, అన్ని ప్రాంతాలకు మంచినీరు అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
'తాగునీటి సమస్య పరిష్కారానికి మూడున్నర కోట్లతో కార్యాచరణ'
గుంటూరు నగరంలో వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం మూడున్నర కోట్లతో కార్యచరణ రూపొందించినట్లు మేయర్ కావటి మనోహర్ నాయుడు తెలిపారు. అన్ని ప్రాంతాలకు మంచినీరు అందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గుంటూరు మేయర్ తో ఎమ్మెల్సీ లక్ష్మణరావు
తాగునీటి పనులకు సంబంధించి టెండర్లను ఇవాళ్టి సమావేశంలో ఆమోదించారు. నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపర్చేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 14రోజుల కార్యాచరణ ఖరారు చేశారు. క్లాప్ కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. నగరంలో మరుగుదొడ్ల సమస్య, వీధి దీపాల సమస్యల్ని సభ్యులు ప్రస్తావించారు.
ఇదీ చదవండి: తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో చోరీకి విఫలయత్నం