గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా జిల్లాలో 359 కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 67,665కు చేరింది. అత్యధికంగా గుంటూరు నగర పరిధిలో 65 కేసులు వెలుగుచూడగా... తెనాలిలో 41 కేసులు నమోదయ్యాయి. రేపల్లెలో 16, బాపట్లలో 15, దుగ్గిరాల, వట్టిచెరుకూరులో 13 మంది వైరస్ బారిన పడ్డారు. మంగళగిరి ప్రత్తిపాడు, మాచర్లలో పదేసి కేసులు చొప్పున నమోదయ్యాయి.
జిల్లాలో ఇప్పటివరకు 62, 373మంది కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. ఇవాళ మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 614గా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా కారణంగా అధిక మరణాలు సంభవిస్తోన్న జిల్లాల్లో గుంటూరు రెండోస్థానంలో నిలిచింది.