ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: నల్లమలలో కార్చిచ్చు - నల్లమలలో ఫైర్​

తెలంగాణలోని కొల్లాపూర్‌ మండలం గుడిగట్టు సమీపంలోని నల్లమల ఆడవిలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. బుధవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఎండిన గడ్డి ద్వారా మంటలు వ్యాపించాయని అటవీశాఖ రేంజర్‌ రవీందర్‌నాయక్‌ చెప్పారు.

fire in nallamala
నల్లమలలో కార్చిచ్చు

By

Published : Mar 18, 2021, 11:52 AM IST

తెలంగాణలోని నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్ సమీపంలో నల్లమల అడవిలో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. కొన్ని కిలోమీటర్ల మేర చెట్లు కాలిబూడిదయ్యాయి. మంటలు చెలరేగే అడవి ప్రాంతానికి చేరుకోడానికి రహదారి లేకపోవడంతో అటవీశాఖ అధికారులు నానా ఇబ్బందులు పడుతూ గుడిగట్టు ప్రాంతానికి చేరుకున్నారు. అటవీశాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఆరు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

మంటలు సమీపంలోని మామిడితోటలకు కూడా వ్యాపిస్తాయని రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు మంటలు అదుపులోకి రావటంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అడవిలోని విలువైన నారవేప కలప కాలిపోయినట్లు రేంజర్ రవీందర్‌నాయక్ తెలిపారు. అనుమతి లేకుండా అడవిలోకి ఎవరు వెళ్లినా చర్యలు తీసుకుంటామని ‌హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details