Farmers for urea : గుంటూరు జిల్లాలోని డెల్టా ప్రాంతంలో మొక్కజొన్న రైతులను.. యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. యూరియా కోసం రైతులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రైతు భరోసా కేంద్రాలు, సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గంటలకొద్దీ క్యూలైన్లలో వేచి చూడాల్సి వస్తోందని వృద్ధులు, మహిళలు వాపోతున్నారు. ఆధార్ కార్డుపై ఎకరాకు కేవలం రెండు బస్తాలే ఇస్తున్న అధికారులు.. దానికీ లిక్విడ్ యూరియా కొనాలని లింకు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రికమండేషన్ ఉన్నవారికి ఎక్కువ మొత్తంలో యూరియాను తరలిస్తున్నారని కౌలు రైతులు ఆరోపిస్తున్నారు.
లిక్విడ్ యూరియా కొనుగోలు చేస్తేనే...
Farmers for urea : లిక్విడ్ యూరియాను కొనుగోలు చేస్తేనే రెండు బస్తాల యూరియా ఇస్తామనే రీతిలో అధికారులు వ్యవహరిస్తున్నారని అక్కడికి వచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. లిక్విడ్ యూరియా కేవలం మొక్క తొలిదశలో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడుతుందనీ.. మొక్క ఎదిగిన తర్వాత ఏ మాత్రం ఉపయోగం ఉండదని వాపోతున్నారు. లిక్విడ్ ధర రూ.240 వెచ్చించి తీసుకున్న ఉపయోగపడని దాన్ని ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు.