రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ఉద్యోగుల జీతాల్లో కోత విధించం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు చేయకపోవటంపై తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ఈ విషయమై సీఎం జగన్కు ఆయన బహిరంగ లేఖ రాశారు.
ప్రభుత్వ ఖజానాలో గత ఏడాది కన్నా రూ.30 వేల కోట్లు అదనంగా ఉన్నా.. పంటల కొనుగోలు, కరోనా నివారణ చర్యలు ఎందుకు చేపట్టడం లేదని ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. ఆక్వా, పౌల్ట్రీ, ఉద్యానవన ఉత్పత్తులను ఎందుకు కొనుగోలు చేయటంలేదని ప్రశ్నించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ నిధులతో పంటలు కొనుగోలు చేస్తామని బడ్జెట్ సమావేశాల్లో చెప్పిన ప్రభుత్వం ఇప్పుడెందుకు ఆ పని చేయటం లేదని నిలదీశారు. ధాన్యం కొనుగోలుపై సీఎం జగన్ కనీసం ఒక్క ప్రకటన కూడా చేయకపోవటం సరికాదన్నారు. ప్రభుత్వ ఖజానా నిధులపై గోప్యం ఎందుకు పాటిస్తున్నారని ప్రశ్నించారు.
నిధులిచ్చినా ఎందుకు కోతలు?