దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం బలపడాలని.. ఇందుకు వామపక్ష పార్టీల పునరేకీకరణ జరగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. గుంటూరులోని ఎన్జీవో కల్యాణ మండపంలో సీపీఐ ఎంఎల్ రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. దేశంలో ప్రస్తుత వ్యవస్థను మార్చడానికి పోరాడుతున్న శక్తులకు ఎదురవుతున్న సవాళ్లపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యుడు జశ్వంతరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పాల్లొన్నారు.
'వామపక్షాల పునరేకీకరణ జరగాలి' - సీపీఐ ఎంల్ కేంద్ర కమిటీ సభ్యుడు జశ్వంతరావు
కష్టజీవుల్లో ఆత్మవిశ్వాసం నింపాలంటే చీలిపోయిన వామపక్ష పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావాల్సిన అవసరముందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
సీపీఐ ఎంఎల్ రాష్ట్రస్థాయి సదస్సు
కష్టజీవుల్లో ఆత్మవిశ్వాసం నింపాలంటే చీలిపోయిన వామపక్షపార్టీలన్నీ ఒకే వేదికపైకి రావాల్సిన అవసరముందని రామకృష్ణ అభిప్రాయ పడ్డారు. ప్రజల సమస్యలపై బలంగా పోరాడుతున్నా.. అంతకుమించి రాజకీయ ప్రభావాన్ని కల్గించలేకపోతున్నామని చెప్పారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని పునరుజ్జీవింపజేయడమే సదస్సు లక్ష్యమని సీపీఐ ఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యుడు జశ్వంతరావు చెప్పారు.
ఇవి చదవండి...సైకిల్ పైనే ఆంధ్రా ప్రజల సవారీ: లగడపాటి